కేంద్రంలో అంతా అనిశ్సితి

Sonia Gandhi
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో యుపిఎకు గానీ ఎన్డీయెకు గానీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. దీంతో యుపిఎకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెసు, ఎన్డీయెకు నేతృత్వం వహిస్తున్న బిజెపి ప్రాంతీయ పార్టీలను దువ్వేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ స్థితిలో ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఎన్డీయెకు పూర్తి మద్దతిస్తారని భావించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి డీమాండ్ ను ముందుకు తెచ్చారు. దాంతో వెంటనే ఏ మాత్రం ఆలోచన లేకుండా అందుకు తాము సిద్ధమని కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. ఈ పరిణామంతో బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

అన్నాడియంకె నేత జయలలిత ఎటూ తేల్చకుండా బేరసారాలకు అవకాశం కల్పిస్తున్నారు. జయలలితను తన వైపు రాబట్టేందుకు కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెసు నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాత్రి జయలలితతో మాట్లాడారు. అయితే ఆమె ఆచరణ సాధ్యం కాని షరతులు పెట్టినట్లు సమాచారం. దీంతో దిక్కు తోచని స్థితిలో కాంగ్రెసు నాయకత్వం పడింది.

తృతీయ కూటమి పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. ఆ కూటమిలో ఏ పార్టీలు ఉంటాయో, ఏ పార్టీలు ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో ఉన్నామని చెబుతున్న దేవెగౌడ వంటి నాయకులు అటో ఇటో ఫిరాయించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+