హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్యతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, ఇతర లాంఛనాలపై ఆయన రోశయ్యతో చర్చించారు. రెండో సారి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన హైదరాబాదులోని లాల్ బహాదూర్ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేస్తారు. ఈ ఏర్పాట్లపై రోశయ్యతో రమాకాంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.