పెద్దపులి మృతదేహం లభ్యం

ప్రభాకరన్ తలలో బుల్లెట్ గాయం అయినట్లు శ్రీలంక సైనికాధిపతి జనరల్ శరత్ ఫోన్సెకా చెప్పారు. ప్రభాకరన్ మృతదేహం యుద్ధ క్షేత్రంలో కొద్ది గంటల క్రితం లభ్యమైందని ఆయన చెప్పారు. పార్లమెంటులో శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే విజయ ప్రసంగం చేసిన కొద్ది గంటల తర్వాత ఫోన్సెకా ప్రభాకరన్ మృతిని ధృవీకరించారు. ప్రభాకరన్ మరణించాడనే ప్రకటనకు తాను బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. రాజపక్సే మాత్రం తన ప్రసంగంలో ప్రభాకరన్ మృతి గురించి ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications