గీతారెడ్డిని స్పీకర్ చేయాలి
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన మహిళ, ఎమ్మెల్యే గీతారెడ్డికి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని తెలంగాణ మాలమహానాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని డిమాండ్ చేసింది. ఆమెకు ఆ పదవినిచ్చి దళితులకు గౌరవాన్ని పెంచాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.దయాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ మధుసూదన్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోగానే 'ఉద్యమ తెలం గాణ' అంటూ కొత్త గళాలు విన్పిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయ త్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications