బాబు మాట విద్యాసాగర్ రావు నోట
కరీంనగర్: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భారతీయ జనతా పార్టీ నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు గొంతు కలిపారు. ఇవియంలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవీఎంల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని బిజెపి నేత విద్యాసాగరరావు కూడా అభిప్రాయపడ్డారు.
దేశంలో శ్రమశక్తి పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి యంత్రాలు అవసరం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బిజెపిని అంటరాని రాజకీయపక్షంగా చూడటం వల్లనే తెలుగుదేశం ఎన్నికల్లో ఓటమి పాలయిందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఇతర రాజకీయ పక్షాలతో కలసి ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications