చిరంజీవి లేకుంటే జీవితమే లేదు
నెల్లూరు : యానాది కులానికి చెందిన తనను వివిధ వేదికల మీద కూర్చొపెట్టి మాట ప్రకారం చట్టసభల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన చిరంజీవి లేకుంటే తన జీవితమే లేదని, ఆయన తమ కుటుంబానికి దేవుడని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు తుపాకుల మునెమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.
నెల్లూరులోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ యానాది కుటుంబానికి చెందిన తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి అన్నారు. ఎన్నికల్లో సామాజిక న్యాయం కోసం తనను ఉపయోగించుకుని ప్రస్తుతం పక్కన పెట్టేశారని ఒక టీవీ ఛానల్‌లో వచ్చిన వార్తా కథనాన్ని ఆమెఖండించారు. కష్టం చేసుకుని బతికే తాను ఇప్పటికీ అలా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు.
నా కోసం చిరంజీవి అన్నయ్య ఎన్నో చేశారు. అట్టడుగునున్న నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కోవూరు సీటిచ్చి నిలబెట్టారు. నా విజయం కోసం ఆయన కుటుంబం చిత్తశుద్ధితో కృషి చేయకుంటే 23 వేల ఓట్లు ఎలా వస్తాయి. అన్నయ్య నన్ను పట్టించుకోవడం లేదని జరుగుతున్న ప్రచారం కన్నీళ్లు తెప్పిస్తోందని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు తుపాకుల మునెమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications