చిరు మా ఓట్లూ చీల్చారు: సిఎం

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ తమ ఓట్లనే ఎక్కువ చీల్చారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఆయన బుధవారం శాసనసభలో సమాధానమిచ్చారు. ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన 17 శాతం ఓట్లలో 11 శాతం ఓట్లు కాంగ్రెసు పార్టీవేనని, దాని వల్ల కూడా తమకు కొన్ని సీట్లు తగ్గాయని ఆయన అన్నారు. తాము విశ్వసనీయతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిచామని ఆయన చెప్పారు. తాను తీర్పు పట్ల పూర్తి సంతృప్తికరంగా లేనని, తమకు ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సి ఉండిందని, అందుకు చాలా కారణాలున్నాయని, వాటిని ఇక్కడ వివరించడం అనవసరమని ఆయన అన్నారు. వాగ్గానాలను తుంగలో తొక్కితే వంచన, మోసం అని, 1999 ఎన్నికల్లో రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని ఆయన అన్నారు.

ఈ ఎన్నికలు వంచనకు, మోసానికి మధ్య జరిగాయని, ప్రతిపక్షాల ఆల్ ఫ్రీ వాగ్దానాలను ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తెరాస, సిపిఐ, సిపిఎం తమతో ఉన్నాయని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీతో కలిశాయని, ఆ నాలుగు పార్టీల కన్నా తమకు 1.8 శాతం ఎక్కవ ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనికి ఆహార పథకం అమలును, తమ ప్రభుత్వంలో జరిగిన ఉపాధి హామీ పథకం అమలుతో బేరీజు వేయాలని, పనికి ఆహార పథకం తెలుగుదేశం పార్టీ భోజన కార్యక్రమంగా మారిందని, ఉపాధి హామీ పథకం అమలులో తాము ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన చెప్పారు.

తమ ఐదేళ్ల పాలనను బేరీజు వేసి ప్రజలు తమను ఆశీర్వదించారని, తమను ప్రభుత్వంలో కొనసాగమన్నారని ఆయన చెప్పారు. మరింత జాగ్రత్తగా పని చేయాలని తమకు ప్రజలు పాస్ మార్కులు ఇచ్చారని ఆయన అన్నారు. లోపాలను సరిదిద్దుకుని మరింత మేలైన పాలనను అందించాలని ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. మరింత వేగంగా అభివృద్ధి చేయాలని, మరింత ఎక్కువ సంక్షేమ కార్యక్రామాలు కావాలని ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను ఆయన విమర్శించారు. తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. తమకు మరో అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ నిరుద్యోగం దూరమవుతుందని ఆయన అన్నారు. సమాచార హక్కులో తమ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఒక్క ఎకరా పంట కూడా ఎండకుండా చూశామని ఆయన చెప్పారు. రైతు కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కూడా ప్రశంసించారని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. ఎక్కడ రైతు ఆత్మహత్య జరిగినా తాము స్పందించామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సమాధానం సుదీర్ఘంగా సాగింది. ఎన్ని రకాల వాగ్దానాలు చేసిన చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీవారు నగదు బదిలీ పథకం అని బోగస్ ఎటిఎం కార్డులు పంచారని, అలా పంచినవారిని క్రిమినల్ కేసు కింద బుక్ చేయాలని ఆయన అన్నారు.

విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదని ఆయన చంద్రబాబును సంబోధిస్తూ అన్నారు. చిన్ననాటి నుంచి 55 ఏళ్లుగా ప్రజలు చంద్రబాబును చూస్తున్నారని, చంద్రబాబు చేసిన పనులను కూడా ప్రజలు చూశారని, ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా నమ్ముతారని ఆయన అన్నారు. చంద్రబాబు హామీలను నమ్మబోరని బాలకృష్ణ, ఎన్టీఆర్ కూడా అనుకున్నారని, హామీలను అమలు చేయించే బాధ్యత తమదని చెప్పారని ఆయన అన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. చంద్రబాబు 18 గంటలు ఎలా పనిచేశారని, తాను 12 గంటలు మాత్రమే పనిచేస్తున్నానని, చిన్న అబద్ధాలు ఆడడానికి కూడా తనకు మనసొప్పదని, అంత అబద్ధం చంద్రబాబు ఆడారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+