వైయస్ వి చిచ్చు వ్యాఖ్యలు: బాబు

"మొదటి విడత ఎన్నికలు ముగియగానే నంద్యాలలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో కోస్తా, రాయలసీమ వాసులు విదేశీయులవుతారని ఎందుకు చెప్పారు. పులిచింతలకు శంకుస్థాపన చేస్తే అక్కడ గుడిసెల్ని తగలబెట్టిన వ్యక్తి ఈ రోజు మీ మంత్రివర్గంలో ఉన్నారు. జిల్లా, జిల్లాకు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయని రెచ్చగొడుతున్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే పద్ధతి మంచిదికాదు. తెలంగాణను అడ్డం పెట్టుకుని చిచ్చుపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రారంభించిందే తెదేపా ప్రభుత్వం. ముఖ్యమంత్రిలో స్వార్థ్యం పెరిగిపోయింది. రాష్ట్ర ప్రజల్లో అభద్రతా భావం కలిగించొద్దు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు పెట్టి, కోస్తాంధ్రలో అదనపు నీళ్లిస్తామంటున్నారు. విభేదాలు కాకుండా అభివృద్ధి ఫలితాలు అందేలా చూడండి. తీరు మార్చుకోండి. తెలంగాణ విషయంలో మోసం చేయడం సరికాదు" అని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications