వైయస్ ది రెచ్చగొట్టే ధోరణి: దేవేందర్

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని మంత్రులకు సూచిస్తుంటే రాజశేఖర రెడ్డి మారారని, ముఖ్యమంత్రి వ్యవహార శైలి అదే రీతిలో ఉంటుందని అనుకున్నామని, కానీ రాజశేఖర రెడ్డి అలా లేరని ఆయన అన్నారు. పైగా తెలంగాణపై రాజశేఖర రెడ్డి అసందర్భంగా కూడా మాట్లాడారని, అందుకు సందర్భం కూడా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నోరు పారేసుకునే పద్ధతిలో మాట్లాడారని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు అది కాదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎలా మాట్లాడుతుందో, ఎలా వ్యవహరిస్తుందో ప్రజలకు తెలుసునని, కెసిఆర్ బాధ్యతారహితంగా నోరు పారేసుకోవడం అందరికీ తెలిసిందేనని, అయితే బాధ్యతాయుతమై ముఖ్యమంత్రి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. అలా వ్యవహరించడం వల్ల ఏదో సాధిద్దామని రాజశేఖర రెడ్డి అనుకుంటూ ఉండవచ్చు గానీ ప్రజలు అసహ్యించుకుంటారని ఆయన అన్నారు. అందుకు రాజశేఖర రెడ్డి శాససనభను వేదిక చేసుకోవడం కూడా బాగా లేదని ఆయన అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఏమీ చెప్పకపోగా అనవసరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications