సీఎంతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిశారు. శ్లాబ్ సిస్టంను రద్దుచేయటంతో పాటు సినీ పరిశ్రమకు మేలు చేసే పలు చర్యలు తీసుకున్నందుకు వారు ముఖ్యమంత్రిని అభినందించారు. ఫిలింఛాంబర్ తరపున సత్కార కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. చిన్న సినిమాలు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ సాయం అవసరమని కోరారు. వారి విజ్ఞప్తులను పరిశీలించాలని సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డిని సీఎం ఆదేశించారు.
తమ సమస్యలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సానుకూలంగా ప్రతిస్పందించారని కెయెస్ రామారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిశీలిస్తానని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డిని ఆదేశిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications