మందా దాడిపై బ్యాంకర్ల పోరు బాట
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్‌రెడ్డిపై పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం దాడి చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకర్లు మండిపడుతున్నారు. మందా జగన్నాథం బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంబంధిత సంఘం అధ్యక్షుడు రవికాంత్ డిమాండ్ చేశారు. మందా జగన్నాథం చర్యను నిరసిస్తూ బుధవారం ర్యాలీ నిర్వహించేందుకు బ్యాంకర్లు సమాయత్తమవుతున్నారు.
మందా జగన్నాథంపై పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు రవికాంత్ చెప్పారు. 8 జిల్లాల్లోని గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో రుణాలను నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. వాణిజ్య బ్యాంకుల ముందు ధర్నాలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆందోళలను మరింత ఉధృతం చేసేందుకు రేపు తమ సంఘం కార్యవర్గం సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications