గాజువాకలో బాలుడు అదృశ్యం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఐదో తరగతి చదువుతు ఒక బాలుడు అదృశ్యమయ్యాడు. గురువారం సాయంత్రం నుంచి పవన్ అనే విద్యార్థి కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పవన్ తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. కిడ్నాప్ కు అవకాశాలు లేకపోవచ్చునని భావిస్తున్నారు. బడికి వెళ్లడం ఇష్టం లేని పవన్ పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పవన్ భాష్యం పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. అయితే తల్లిదండ్రులకు పెద్దగా అనుమానం రాకపోవడంతో అంతటా వెతికి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబం సంపన్నమైంది కాకపోవడంతో కిడ్నాప్ నకు అవకాశాలు లేవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications