హైదరాబాద్: అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశించారు. అవినీతి నిరోధకశాఖ కేసులపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అక్రమ ఆస్తుల కేసుల్లో ఎంత పెద్దవారున్న వదలొద్దని అధికారులకు స్పష్టంచేశారు.
ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవినీతి, అక్రమార్కులపై స్వయంగా ఫిర్యాదు చేసేలా వారిని చైతన్యపరచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధకశాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు.