తెరాస నేత ఇబ్రహీం అరెస్టు
మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత ఇబ్రహీంతోసహా మరో 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. శీతల్ షిప్పింగ్ కంపెనీ గోడౌన్ పై దాడి కేసులో సంబంధం ఉందంటూ వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇబ్రహీం ఇటీవలి ఎన్నికల్లో తెరాస తరపున పోటీ కూడా చేశారు. వీరి అరెస్టును నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో శనివారం షాద్ నగర్ లో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జీ చేశారు.












Click it and Unblock the Notifications