హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు దాసరి నారాయణరావు ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. సుమారు గంటసేపు జరిగిన ఈ విందు భేటీలో రాజ్యసభ సభ్యుడు, వైయస్ సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచందర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.