ఆదాయం పన్ను పరిమితి పెంపు
న్యూఢిల్లీ: పన్నుల సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పార్లమెంటులో ఆయన సోమవారం బడ్జెట్ ను ప్రతిపాదించారు. 45 రోజుల్లో ప్రత్యక్ష పన్నుల వ్యవస్థీకృత నియమావళిని రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త వస్తువులు, సేవల పన్నుల విధినిధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. కార్పొరేట్ పన్నుల విధానం యథాతథంగా ఉంటుందని ప్రకటించారు.
ముఖ్యాంశాలు
- వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితి 1.50 లక్షల నుంచి 1.60 లక్షల రూపాయలకు పెంపు
- మహిళల ఆదాయం పన్ను పరిమితి 1.8 లక్షల నుంచి 1.9 లక్షల రూపాయలకు పెంపు
- సీనియర్ సిటిజన్ల ఆదాయం పన్ను పరిమితి 2.40 లక్షల రూపాయలకు పెంపు
- ఫ్రెంజ్ బెనిఫిట్ రద్దు
- వస్తు లావాదేవీల పన్ను రద్దు
- వ్యక్తిగత ఆదాయ పన్నుపై పది శాతం సర్ చార్జీ రద్దు
- రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళంపై వంద శాతం పన్ను రాయితీ












Click it and Unblock the Notifications