న్యూఢిల్లీ: ఉగ్రవాదమే ప్రపంచానికి అసలైన సవాల్ అని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె సోమవారం ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తమకు భారత సహకారం అవసరమని ఆమె అన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కునే వారిని ఆదుకునే మార్గాలను కూడా చూడాల్సి ఉందని ఆమె అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రస్తుతం అసలు సిసలు సవాల్ అని ఆమె అన్నారు. అమెరికా, భారత్ ల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నట్లు ఆమె తెలిపారు.