తల తెగిపడ్డా ఆగను..కేసీఆర్
మహబూబ్‌నగర్:సాగు,తాగునీటితో పాటు కల్తీకల్లు, కాలుష్యాలపై కూడా పోరాటం చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. అలాగే తల తెగిపడ్డా తెలంగాణా ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా ఉద్యమాన్ని కొత్త పంథాలో ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.ఎంపీగా గెలిచిన తరువాత ఇంత వరకు నియోజకవర్గానికి ముఖం చూపని కేసీఆర్ తొలిసారిగా పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో ఏర్పడ్డ సమస్యలు, ఆషాఢ మాసం కారణంగా పాలమూరు రాలేక పోయానని, ప్రజలు మన్నించాలని కోరారు.ఉద్యమాన్ని చీ ల్చేందుకు, తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మా ర్చేందుకు పాలకులు కుట్ర పన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రస్తుత సంక్షోభాన్ని రష్యా విప్లవంతో పోల్చారు.
జిల్లా కేంద్రంలో కుటీరం నిర్మించుకొని ఇక నుంచి వారానికి మూడు రోజులు ఇక్కడే ఉంటానన్నారు. ఎంపీ హోదాలో మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనను స్థానిక బార్ అసోసియేషన్ సన్మానించింది. న్యాయ పదవుల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని విచారం వె లిబుచ్చారు. ఏజీ పదవిని ఇప్పటి వరకు తెలంగాణ వారికి ఇవ్వలేదని గుర్తు చేశారు. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా కేంద్రం స్పందించలేదని, రాష్ట్ర ప్రభుత్వమూ తాత్సారం చేసిందని విమర్శించారు. తెలంగాణలో ఎత్తిపోతల కింద సూక్ష్మ సేద్యం అమలు పేరుతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టజూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications