మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి జరిగింది. ఈ దాడి విషయాన్ని ఒక తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ ఆస్ట్రేలియా ప్రధాని కెవని రుడ్ తో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. పరంజిత్ సింగ్ అనే విద్యార్థిపై దాడి జరిగినట్లు ఆ వార్తా చానెల్ తెలిపింది.
ఈవ్ టీజింగ్ ను నిరోధించినందుకు ఆ విద్యార్థిపై కొంత మంది దుండగులు దాడి చేసినట్లు తెలిపింది. పరంజిత్ సింగ్ మెల్బోర్న్ లో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలియజేసింది. వివరాలు తెలియాల్సి ఉంది.