హైదరాబాద్: తనను ప్రేమించాలంటూ మహిళా అధ్యాపకురాలిని ఇంజినీరింగ్ విద్యార్థి వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లేడీ లెక్చరర్ ను ప్రేమ పేరుతో వేధిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి నితీష్ రెడ్డిని హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. చిలుకూరులోని షాద్ ఇంజినీరింగ్ కళాశాలలో నితీష్ రెడ్డి ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. నితీష్ రెడ్డి వేధింపులు తాళలేక ఆమె ఉద్యోగం కూడా మానేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నితీష్ రెడ్డిని అరెస్టు చేశారు.