నన్ను రెచ్చగొట్టవద్దు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: అనవసరమైన మాటలు మాట్లాడి తనను రెచ్చగొట్ట వద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం సభ్యులను హెచ్చరించారు. వ్యాట్ పై చర్చ సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారి ఇచ్చిన సమాధానంతో తెలుగుదేశం సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. తాను మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి వస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరెంట్ చార్జీల పెంపుపై కూడా మాట్లాడుతానని ఆయన అన్నారు. ఆదాయం కోసం పన్నులు వేయాల్సి వస్తుందని, వ్యాట్ వల్లనే సరుకుల ధరలు పెరగడం లేదని ఆయన అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, పన్నులు ఎక్కడ వేయాలో అక్కడే వేస్తామని ఆయన చెప్పారు. వ్యాట్ తొలగిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని, అది ఎప్పుడూ జరిగేదే అని ఆయన అన్నారు. ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న ధరలు ఇప్పుడున్నాయా అని ఆయన అడిగారు. సరుకుల హోల్ సేల్ ధరలు చూస్తే ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలోనే ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ధరల విషయంలో కేంద్రం ఏమీ చేయలేదని, ఆ విషయం రాష్ట్రాలే చూసుకోవాలని ఆయన అన్నారు. కొత్త పంట వస్తే ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. దానికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు విపరీతంగా ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపులోనే ఉన్నాయని మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అక్రమ నిల్వల వల్లనే కందిపప్పు ధర పెరిగిందని ఆమె చెప్పారు. నాలుగు శాతం వ్యాట్ వల్ల ధరలు పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వ్యాట్ అమలులో లేని రాష్ట్రాల్లో కూడా పప్పు దినుసుల ధరలు పెరిగాయని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+