మమ్మల్ని భయపెడుతున్నారు: సిఎం

Chandrababu Naidu
హైదరాబాద్: శాసనసభలో తమను పాలకపక్షం భయపెడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము భయపడబోమని, తమ రాజకీయానుభవంతో వ్యవహరిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన కనుసన్నల్లో శాసనసభా సమావేశాలు జరగాలని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనభలో ప్రతిపక్షాల సభ్యులను బడిపిల్లలను భయపెట్టినట్లు భయపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి సభలో నీచంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ కు తగిన గౌరవం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. వైయస్ హుంగా ప్రవర్తించి గౌరవం కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు.

గుర్తింపు లేని పార్టీకి కూడా తమకు కేటాయించినంత సమయం ఇస్తున్నారని ఆయన లోకసత్తానుద్దేశించి అన్నారు. శాసనసభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అలా ఉండాలంటే ప్రతిపక్షాలకు శాసనసభలో తగిన సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన అన్నారు. మిగతా ప్రతిపక్షాలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి శాసనసభలో గంటల తరబడి మాట్లాడుతున్నారని, తమపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే స్పీకర్ వాటిని అనుమతిస్తున్నారని, నిరసన తెలిపి తమను కూర్చోవాలని చెబుతున్నారని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి కె. రోశయ్య తమను బూతులు తిట్టారని, అయినా స్పీకర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+