హైదరాబాద్: కడప జిల్లా ఇడుపులపాయ భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు సోమవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి నోటీసు జారీ చేసింది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కూడా హైకోర్టు నోటీసు ఇచ్చింది. వచ్చే నెల 9వ తేదీ లోగా తమ నోటీసుకు వివరణ ఇవ్వాలని హైకోర్టు వారిద్దరినీ ఆదేశించింది. ముఖ్యమంత్రి ఇడుపులపాయలో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
ఇడుపులపాయలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పేరు మీద, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేరు మీద ఎంతెంత భూమి ఉందనే విషయాలను అశోక గజపతి రాజు తన పిటిషన్ లో పేర్కున్నారు.