విజయవాడ: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులో ఇంటర్మీడియెట్ విద్యార్థి నాగరాజు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. నాగరాజు ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తూ అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు తమ వద్దనే ఉన్నాడని చెబుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపం నుంచి కిడ్నాపర్లు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు.