ముజీబ్ నేరస్థుడే: కోర్టు

రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి పాలరాతిని రవాణా చేసే లారీలో ఆయుధాలను తీసుకు వస్తుండగా 2005 డిసెంబర్ 27వ తేదీన అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముజీబ్, క్లీనర్ రవీంద్ర కుమార్, షబ్బీర్ అహ్మద్ ల నుంచి పోలీసులు శాటిలైట్ ఫోన్, 1.15 లక్షల రూపాయల నగదు, రెండు సిడీలు, రెండు సెల్ ఫోన్లు, 2.9 లక్షల రూపాయల చెక్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు పోలీసులు ముజీబ్ పై, అతడికి సహకరించిన 19 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో ముజీబ్ ను పోలీసులు హైదరాబాదు తరలించారు.
గతంలో ఐపియస్ అధికారి కృష్ణప్రసాద్ హత్య కేసులో కూడా ముజీబ్ నిందితుడు. ఈ కేసులో జీవిత ఖైదు పడింది. అయితే ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో 2004లో జైలు నుంచి విడుదలయ్యాడు. హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారని ముజీబ్ ఆరోపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications