జాడ లేని హెలికాప్టర్: సిఎం క్షేమం

ముఖ్యమంత్రి ఆచూకీకి సంబంధించి హైదరాబాదుకు గానీ కర్నూలుకు గానీ ఎటువంటి సమాచారం అందలేదు. దాదాపు రెండు గంటలకు పైగా తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. హెలికాప్టర్ ఎక్కడ దిగిందనే విషయాన్ని కూడా అధికారులు చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి రోడ్డు ద్వారా కర్నూలుకు బయలుదేరినట్లు వార్తలు వచ్చినప్పటికీ దాన్ని ధృవీకరించలేకపోయారు. ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నట్లు మాత్రం హైదరాబాదు సచివాలయంలోని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ ఆచూకీ కోసం హైదరాబాద్ నుంచి ఆర్మీ హెలికాప్టర్ బయలుదేరింది.
ముఖ్యమంత్రి హెలికాప్టర్ జాడ తెలియకపోవడంతో పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచంద్ర రావు, ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ అరవిందరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్ది సచివాలయానికి వచ్చారు. ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి కర్నూలు బయలుదేరినట్లు వార్తలు వచ్చినప్పటికీ కర్నూలు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ ధృవీకరించలేకపోయారు. అయితే దాదాపు ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి వస్తున్నారంటూ కర్నూలులో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి దిగిన ప్రాంతంలో నక్సల్స్ ప్రభావితం అధికంగా ఉండడంతో ముఖ్యమంత్రి ప్రయాణాన్ని గోప్యంగా ఉంచినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications