కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం నల్లమల అడవుల్లో తీవ్రగాలింపు ప్రారంభమైంది. నాలుగు ఆర్మీ హెలికాప్టర్ లతో సిఎం ఆచూకీకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా దళాలు గాలింపు చేస్తున్నారు. అడవి చుట్టపక్కల గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు చెందిన వేలాది మంది అడవిలోకి వెళ్లి సిఎం ఎక్కడున్నారో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులెరొంటున్నాయి. అటవీప్రాంతంలోని చెంచుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.