వారేం ఇచ్చారో చెప్తారా: రోజా

కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు తాను లొంగిపోయినట్లు వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు తనకు బాధ కలిగిస్తున్నాయని, పైగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగి పార్టీలోకి వచ్చినవారు తనపై విమర్సలు చేస్తున్నారని ఆమె అన్నారు. తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని, త్వరలోనే వెల్లడిస్తానని రోజా చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు శత్రువులు పెరిగారని ఆమె అన్నారు. రాజకీయాలు, సినిమా తనకు రెండు కళ్లలాంటివని ఆమె చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications