వారికి వైద్యమంటే తెలుసా: పితాని

Pitani Satyanarayana
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని వైద్య శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పనికి రాకుండా పోయిందని తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శలను ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ఆరోగ్యశ్రీ పథకంపై శ్వేత పత్రం విడుదల చేయడానికి తాము సిద్ధమేనని ఆయన చెప్పారు. కనీస పరిజ్ఞానం లేకుండా తెలుగుదేశం నాయకులు ఆరోగ్యశ్రీ పథకంపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

పేదలకు మనోధైర్యాన్ని కలిస్తున్న పథకాన్ని సహించలేకలనే తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోని తెలుగుదేశం పార్టీకి తమపై విమర్శలు చేసే హక్కు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైద్యమంటే, ఆస్పత్రులంటే తెలుసా అని ఆయన అడిగారు. కొన్ని కార్పోరేట్ ఆస్పత్రుల మేలుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+