'అల్ జజీరా' మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. POK నిరసనల్ని కవర్ చేసినందుకే..!
అంతర్జాతీయ మీడియా సంస్థ 'అల్ జజీరా' పై పాకిస్థాన్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆందోళనలు చేపడుతున్న నిరసనకారులపై పాకిస్థాన్ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని అక్కడి ప్రజలపై పాకిస్థాన్ ప్రభుత్వం దాడులు చేపడుతోందని అల్ జజీరా న్యూస్ ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన తరుణంలో ఈ మీడియా సంస్థపై పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు స్పష్టం అవుతోంది. అయితే షెహబాజ్ ప్రభుత్వం ఈ న్యూస్ మాధ్యమంపై పూర్తిగా నిషేధం విధించనప్పటికీ పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లోని యూజర్స్ కు అల్ జజీరా మీడియా లైవ్ స్ట్రీమింగ్ కావడం లేదని సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు పాకిస్థాన్ కు చెందిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అల్ జజీరా సంస్థ సెలక్టివ్ రిపోర్టింగ్ చేస్తోందని మండిపడింది. పీఓకే జరుగుతున్న ఎన్నికలు, ఓటింగ్ విధానాన్ని తప్పుగా ప్రసారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన విషయాలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. " ముజఫరాబాద్ లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని అల్ జజీరా మీడియా సంస్థ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించాం. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఎన్నికలు, ఓటింగ్ విధానాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ న్యూస్ సంస్థ యత్నించినట్లు స్పష్టం అవుతోంది" అని ఎక్స్ మాధ్యమంలో పాకిస్థాన్ కు చెందిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పోస్టు చేసింది.
ఖతార్‌కు చెందిన మీడియా సంస్థ అల్ జజీరా ఈ మేరకు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో యెల్లో జర్నలిజం చేస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం కీలక ఆరోపణలు చేస్తోంది. ముజఫరాబాద్, పీఓకేలో ఎన్నికలను అపఖ్యాతి పాలు చేస్తోందని మండిపడింది. మరోవైపు పీఓకే లో మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక పీఓకే లో పరిస్థితిపై అల్ జజీరా కీలక విషయాలను ప్రచురించింది. ముజఫరాబాద్ లో ఓటింగ్ కు ప్రజలు ముందుకు రావడం లేదని పేర్కొంది. గత 50 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా స్థానిక పరిస్థితులను సమగ్రంగా నివేదించడం కష్టంగా మారిందని అల్ జజీరా స్పష్టం చేసింది. అలాగే ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications