కెసిఆర్ ది బురద రాజకీయం: శ్రీధర్

Sridhar
హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుది బురద రాజకీయమని రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులపై, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై కెసిఆర్ చేసిన విమర్శలపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు.

రాయలసీమ ప్రాజెక్టులను అక్రమమని అంటున్న కెసిఆర్ తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా అక్రమమని అనగలరా అని ఆయన అడిగారు. జల విద్యుదుత్పత్తికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశారనే విషయం తెలిసినా కెసిఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో 17 లక్షల కరెంట్ మోటార్లున్నాయని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి జరగకపోతే వాటికి విద్యుత్తును అందించడం కష్టమని తెలుసునని, అయినా కెసిఆర్ తప్పుడు విమర్శలు చేశారని ఆయన అన్నారు. వరదలను కూడా రాజకీయం చేయడం కెసిఆర్ కు మంచిది కాదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు వల్లనే వరదలు వచ్చాయని కెసిఆర్ విమర్శించడం బురద రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+