రాజీనామాకు భయపడను: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy
హైదరాబాద్: తాను రాజీనామా చేయడానికి భయపడబోనని, పదవులు శాశ్వత కాదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్ పై ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పందించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆమె అన్నారు. సిబిఐ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని ఆమె అన్నారు. దర్యాప్తునకు సిబిఐ రెండు నెలల గడువు కోరిందని ఆమె చెప్పారు.

వైయస్ మరణంపై సిబిఐ దర్యాప్తు నివేదిక అందిన తర్వాతనే నిజాలు తెలుస్తాయని, ఆ తర్వాతనే వైయస్ మరణానికి ఎవరు బాధ్యత వహించాలో తెలుస్తుందని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులో ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డిని అరెస్టు చేస్తామని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+