ముంబై: ముంబైలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పైపు లైను విరిగి లోకల్ రైలుపై పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ములుంద్, థానే స్టేషన్ల మధ్య కోస్రీ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ములంద్, థానేల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ పై పైపు లైన్ వంతెన ఉంటుందని మధ్య రైల్వే పౌరసంబంధాల అధికారి చెప్పారు.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణ నష్టం సంభవించిన సమాచారం లేదు. అయితే రైలు డ్రైవర్ రైలు ఇంజిన్ లోనే చిక్కుకున్నాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు.