వరద సహాయం ఇలాగా?: చిరు కోపం

విరాళాల సేకరణలో భాగంగా శనివారం ఆయన పార్టీ జిల్లా నేతలతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ జోలెయాత్ర ద్వారా ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తారు. ఈ పర్యటన సీతంపేట, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్, వన్ టౌన్ తదితర ప్రాంతాలమీదుగా సాగుతుంది. నిన్న నగరంలోని ఒక హోటల్‌లో దాతలతో ప్రత్యేక విందు కార్యక్రమంలో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా ఎంతో నమ్మకంతో దాతలు అందిస్తున్న ప్రతీపైసా వరద బాధితులకు అందేలా మధ్యవర్తిగా ఉంటానని తెలిపారు. మానవత వాదులు వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications