రోశయ్య తొలి ఢిల్లీ పయనం నేడే

సిఎం హోదాలో రోశయ్య ఢిల్లీ తొలి పర్యట నకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సంద ర్భంగా ఆయన పార్టీ అధినేత్రితో వివిధ ఆంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తనకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇబ్బంది కరమైన వాతా వరణం సృష్టిస్తున్న జగన్ శిబిరానికి కళ్ళెం వేయ డానికి అనుసరించాల్సిన వ్యూహం పై సిఎం అధినే త్రితో చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జగన్ వర్గాన్ని పూర్తిగా కట్టడి చేస్తే తప్ప రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం సజావుగా నడిచేఅవకాశాలు లేవన్న నివేదికలు ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరినట్లు వినిపిస్తున్న నేప ధ్యంలో రోశయ్య భేటికి ఎంతో ప్రాధాన్యత సంత రించుకుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అవిధే యులపై వేటు వేయడం ద్వారా పార్టీలో పూర్తిగా కాంగ్రెస్ ముద్ర ఉండేలా చూడాలని ఆయన అధినేత్రిని కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్న రోశయ్య దీనిపై సోనియా గాంధీ ఆమోదం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications