గ్రేటర్ హైదరాబాద్ కలకలంపై సర్వే డిమాండ్

Congress
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల విషయమై చెలరేగిన అసంతృప్తిపై పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. జాబితాలో ఉన్న అభ్యర్థులెవరికీ ఇంకా బీఫామ్‌ లు ఇవ్వలేదని నిజమైన కార్యకర్తలకు టికెట్‌ కేటాయింపులో న్యాయం జరిగేటట్లు చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధిష్ఠానం అన్ని విషయాలను పరిశీలిస్తోందని కార్యకర్తలెవరూ తొందరపడద్దొని తెలిపారు.

గ్రేటర్‌ టిక్కెట్లను రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావు అమ్ముకున్నారని మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వీహెచ్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వాళ్లకు టిక్కెట్లు ఇప్పించారన్నారు. ఇప్పటివరకూ ఆయన అంబర్‌పేటలో కాంగ్రస్‌వాళ్లను గెలవనీయలేదన్నారు.

2009 ఎన్నికల్లో అంబర్‌పేట్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఫరీదుద్దీన్‌ తొలి నుంచీ దివంగత సీఎం వైఎస్‌ కు అత్యంత సన్నిహితుడు. ఆయన తన వర్గీయుల్లో కొందరికైనా టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే హనుమంతరావు ఇక్కడ అన్ని డివిజన్లలోనూ తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+