గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం చిరంజీవి కసరత్తు

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం తదితర అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల టికెట్లపై కాంగ్రెస్ లో చిచ్చు రేగిన నేపధ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుఖోకపోవడమే మంచిదయిందని ప్రజారాజ్యం సీనియర్ నాయకులు చిరంజీవి ఎదుట తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను పీఆర్‌పీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 51 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు ప్రకటించారు. పీఆర్‌పీకి పట్టున్న డివిజన్లలో సర్వే చేసి అభ్యర్థుల జాబితాను తయారుచేసినట్లు ఆయన తెలిపారు. కాగా కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనమవుతుందని వస్తున్న వార్తలు అవాస్తమని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ తో పొత్తు కోసం చివరిదాకా వేచిచూసి, తీరా విఫలమయ్యాక ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందేమోనని కొందరు నాయకులు సందేహించారు. ప్రస్తుతం పొత్తు లేకున్నావచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అవగాహన కుదిరే అవకాశమే అధికంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పోటీలో ఉండటం ఎందుకనే భావనను ఎక్కువ మంది వ్యక్తీకరించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+