హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్టాత్మక నిజాం వైద్యశాల (నిమ్స్) మరో వివాదంలో చిక్కుకుంది. కిడ్నీ దొంగిలించారంటూ ఆస్పత్రి వైద్యులపై ఆరోపణలు వస్తున్నాయి. నరాల బలహీనతతో చేరిన నస్రీన్(18) అనే యువతి కిడ్నీలను వైద్యులు దొంగిలించారని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. మృతి చెందిన తమ బంధువు కిడ్నీని తొలిగించి వైద్యులు అమ్ముకున్నారని బంధువులు ఆరోపించారు. కాగా అటువంటిది ఏమి లేదని వైద్య వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
గతంలో కూడా నిమ్స్ వైద్యులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్లలో నిర్లక్ష్యం, నర్సులను లైంగికంగా వేధించడం వంటి ఆరోపణలు నిమ్స్ వైద్యులపై ఉన్నాయి.