పర్వతనేని ఉపేంద్ర కన్నుమూత

ఉపేంద్ర 1936 యగడో 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసిన ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పట్టా పొందారు. ది మెయిల్ పత్రికలో కొంత కాలం జర్నలిస్టుగా పని చేశారు. 1957లో మూడో తరగతి ఉద్యోగిగా రైల్వేలో చేరారు. రైల్వే ఉద్యోగం నుంచి తప్పుకుని ఆయన 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. ఏడాది క్రితం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
ఉపేంద్ర మృతికి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. తాను పెద్ద దిక్కు కోల్పోయానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications