మంత్రులకు రోశయ్య క్లాస్

సోమవారం కొంత మంది మంత్రులు మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా రావడంపై కూడా ఆయన గుర్రుమన్నారు. గ్రేటర్ ఎన్నికల పరిశీలన కోసం వచ్చిన పార్టీ పరిశీలకుడు కృష్ణమూర్తిని కలిశామని చెప్పిన మంత్రులతో ఆయన ఏకీభవించలేదు. ఎవరు ఏం చేస్తున్నారో పార్టీ అధిష్టానానికి తెలుసునని ఆయన అన్నారు. మంత్రి వర్గ సమావేశాన్ని తేలికగా తీసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదని, వనరుల సమీకరణ విషయంలో వివిధ శాఖలు దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు. మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications