పేదలకు రిజర్వేషన్లు అవసరం: రాహుల్

Rahul Gandhi
విజయవాడ: రిజర్వేషన్ల వల్ల ప్రతిభా వంతులకు నష్టం జరుగుతున్న మాట వాస్తవమే అయినా పేదలకు రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెసు పార్లమెంటుసభ్యుడు రాహుల్ గాంధీ అన్నారు. విజయవాడలోని లయోలా కళాశాల విద్యార్థులతో ఆయన బుధవారం ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యారంగం నుంచి రాజకీయాల వరకు విద్యార్థులు వేసిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. యువత తమ సత్తా చాటాలని ఆయన సూచించారు. సగం మంది యువకులు తమ సత్తాను చాటడం లేదని ఆయన అన్నారు. ఇంత జనాభా ఉన్న మన దేశంలో ఎంత మంది కార్జియాలిజిస్టులున్నారని ఆయన అడిగారు.

ఆయన బుధవారం ఉదయం డిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ వర్షం వల్ల ఆయన పర్యటన రద్దవుతుందని భావించారు. అయితే ఆయన విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన తిరుపతి బయలుదేరి వెళ్లారు. అయితే తిరుపతి ప్రయాణంలో చాలా ఆలస్యం జరిగింది. వర్షం వల్ల వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన గన్నవరం విమానాశ్రయంలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. విజయవాడలో ఆయన దుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+