ఆమరణ దీక్షతో కెసిఆర్ బెదిరింపు: సర్వే

K Chandrasekhar Rao
హైదరాబాద్: బెదిరింపుల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమరణ దీక్షల వల్ల తెలంగాణ రాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బెదిరించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు బాగుండవని ఆయన కెసిఆర్ కు సలహా ఇచ్చారు.

తెలంగాణ అంశం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఉందని, సోనియా దానిపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అటువంటి స్థితిలో కెసిఆర్ సోనియాను కలవవచ్చునని ఆయన అన్నారు. సోనియా అపాయింట్ మెంటు కెసిఆర్ కు లభిస్తుందని, సోనియా అందరినీ కలుస్తున్నారని, నాయకుడైన కెసిఆర్ కు సోనియా అపాయింట్ మెంట్ లభించకపోవడం ఉండదని ఆయన అన్నారు తాను సోనియా అపాయింట్ మెంటు ఇప్పిస్తానని ఆయన అన్నారు.

కెసిఆర్ సోనియాను కలవాలనుకుంటే ముఖ్యమంత్రి కె.రోశయ్య చొరవ చూపుతారని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఉన్నారని, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులం ఉన్నామని, సోనియా గాంధీని కలవాలనుకుంటే తామంతా చొరవ చూపుతామని ఆయన అన్నారు. ఆమరణ దీక్షకు కెసిఆర్ ఆరోగ్యం సహకరించదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+