లిబర్హాన్ నివేదిక ఫాల్స్: సత్యనారాయణ రెడ్డి

Satyanarayana Reddy
హైదరాబాద్: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతపై లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను తప్పుల తడకగా సంఘటన జరిగిన సమయంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సత్యనారాయణ రెడ్డి అన్నారు. కొన్ని తెలుగు టీవీ న్యూస్ చానెల్స్ తో ఆయన మంగళవారం మాట్లాడారు. లిబర్హాన్ కమిషన్ నివేదికకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. గవర్నర్ గా ఉన్న తనతో మాట్లాడకుండా, కనీసం తనకు లేఖనైనా రాయకుండా లిబర్హాన్ నివేదిక సమర్పించారని, దీన్ని బట్టే నివేదిక తీరు ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

లిబర్హాన్ ను ఆయన ఊరకుక్కల మొగడిగా అభివర్ణించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు కేంద్ర ప్రభుత్వం తనను నివేదిక కోరలేదని, తనంత తానే కేంద్రానికి నివేదిక పంపానని ఆయన అన్నారు. లిబర్హాన్ కమిషన్ నివేదిక అబద్ధాల పుట్ట అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎవరినీ బాధ్యులను చేయలేమని, అది ప్రమాదవశాత్తూ అనుకోకుండా జరిగిన సంఘటన అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+