వేదికను మార్చే యోచనలో కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తన ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను తిప్పి కొట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధిపేటలో ఆయన ఈ నెల 20వ తేదీన ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు అడుగడుగునా మోహరించి కెసిఆర్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తన వేదికను మార్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఆయన వేదికగా మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

కెసిఆర్ తన వేదికను మార్చుకునే అవకాశం ఏ మాత్రం లేదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. కోనాయపేటకు వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి సిద్ధిపేటకు కెసిఆర్ చేరుకుంటారని ఆయన చెప్పారు. కెసిఆర్ అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో కెసిఆర్ ను గృహ నిర్బంధం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గృహ నిర్బంధం చేస్తే ఇంట్లోనే ఆయన దీక్షను సాగిస్తారని చెబుతున్నారు. తనను ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడ దీక్షకు కూర్చుంటానని, జైల్లో పెడితే అక్కడ కూడా దీక్ష సాగిస్తానని కెసిఆర్ ఇదివరకే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+