యాక్టర్ నాగార్జున భూకబ్జాదారు: కెసిఆర్

వినోబా భావే భూదానోద్యమం సందర్భంగా తెలంగాణకు చెందిన వ్యక్తి లక్షా 76 వేల ఎకరాలు దానం చేశాడని, భూదానోద్యమానికి ఆంధ్రావాళ్లెవరూ భూమి ఇవ్వలేదని, తెలంగాణవారే ఇచ్చారని, ఆ భూమిని కూడా కబ్జా చేశారని ఆయన అన్నారు. నార్నే ఎస్టేట్ ఉదంతాన్ని ఆయన వివరించారు. తెలంగాణలో ఆసెన్డ్ భూములను, భూదాన భూములను, గురుకుల ట్రస్టు భూములను, వక్ఫ్ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆయన అన్నారు. కోట్ల కోట్ల రూపాయల విలువ చేసే భూములపై ఆంధ్ర దురాక్రమణ గద్దలు తిష్టవేశాయని ఆయన అన్నారు. భద్రత ముసగులో తన దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. నార్నే రంగారావు 800 ఎకరాల దళితుల భూములను కబ్జా చేశాడని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications