కెసీఅర్ బస్సును ఖమ్మం వైపు తరలిస్తున్న పోలీసులు

మరోవైపు కేసీఆర్ అరెస్టుతో కరీంనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈటెల రాజేందర్‌ను కూడా అరెస్టు చేశారు. అలాగే కరీంనగర్‌లో కేబుల్ ప్రసారాలు, విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రాజీవ్ రహదారిలో పోలీసులు విసృతంగా తనిఖీలు చేపట్టడంతో రహదారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
కేసీఆర్ తలపెట్టిన సిద్దిపేట దీక్షకు తరలివస్తున్న తెరాస శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవాలనే ఆలోచనతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో అలగనూరు, తిమ్మాపూర్... తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications