హైదరాబాద్ లో టీఅర్ ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కేసీఆర్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జంటనగరాల్లో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మలక్‌పేటలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో మలక్‌పేటలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మలక్‌పేట చౌరస్తాలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించడంతో వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఫలక్‌నామా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు తెరాస కార్యకర్తలు రాళ్లురువ్వి ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications