Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాటన్ కు వైజాగ్ లోనూ అదే ఆదరణ

Cotton
విశాఖపట్నం: ప్రాజెక్టుల నిర్మాణంలో సివిల్‌ ఇంజినీర్లదే కీలకపాత్ర అని రాబర్ట్‌ చార్లెస్‌ కాటన్‌ పేర్కొన్నారు. కాటన్‌ దంపతులు నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని సివిల్‌ ఇంజినీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సివిల్‌ ఇంజినీర్లు రైతుల సమస్యలను అర్థం చేసుకొని, వారికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. భారీ ప్రాజెక్టులు నిర్మించే ముందు తగిన పరిశీలన చేయాలని సూచించారు. లేనిపక్షంలో భారీమూల్యం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ, తెలుగుజాతికి ఎందరో విదేశీయులు ఎనలేని సేవలు చేశారని వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాటన్‌, తెలుగుభాషకు చార్లస్‌ పిలిఫ్‌ బ్రౌన్‌ సేవలు చేశారని కొనియాడారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వారసులకు రాష్ట్రంలో జరుగుతున్న జలయజ్ఞం కార్యక్రమాలు చూపించాలని తనకు గతంలో సూచించారని గుర్తు చేసుకున్నారు. ఏయూ వీసీ బీల సత్యనారాయణ మాట్లాడుతూ, కాటన్‌ దొర నిర్మించిన ప్రాజెక్టుల కారణంగానే గోదావరి, కృష్ణా డెల్టాలు సస్యశ్యామలమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కాటన్‌ దంపతులు అక్కడి కాటన్‌దొర విగ్రహానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటన్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. మెటలర్జికల్‌ విభాగపు అదనపు భవనాన్ని కాటన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ప్రసాదరెడ్డి, జ్ణానసుందరరావు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కె.బి.ఎస్‌.ఎల్‌.ఎన్‌.రాజు, ప్రిన్సిపాల్‌ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

వారు అంతకు ముందు పాతపోస్టాఫీస్‌ వద్దనున్న క్వీన్‌మేరీ చర్చిని సందర్శించారు. పక్కనే ఉన్న సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత బోటులో పోర్టును సందర్శించారు. విశాఖలో పోర్టు అవసరమని, భవిష్యత్‌లో ఈ పోర్టు ఎంతో అభివృద్ధి చెందుతుందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఒక పుస్తకంలో రాసిన విషయాన్ని పోర్టు సిబ్బంది రాబర్ట్‌ చార్లస్‌ కాటన్‌కు చూపించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బంది కాటన్‌ దంపతులను జ్ఞాపికతో సత్కరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+