గ్రేటర్ విశాఖకు రెండు గ్రేట్ అవార్డులు

Vishakapatnam
విశాఖపట్నం: మహావిశాఖనగరానికి మరోసారి అరుదైన పురస్కారం దక్కింది. రెండు కేటగిరీల్లో రెండు జాతీయస్థాయి అవార్డులు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా నగరం ఖ్యాతి వ్యాపిం చింది. 63 నగరాలతోపోటీపడి ఉత్తమ బీఎస్‌యూపీ నగరంగా ఎంపికైంది. జాతీయ పట్టణ పునర్నిర్మాణ ప్రయోజన పథకం అమలులో జీవీఎంసీ మంచి పురోగతిని సాధించింది. గురువారం జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం దినోత్స వం సందర్భంగా న్యూఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో నాల్గోవ వార్షికోత్సవ సమావేశం జరిగింది.

పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినందుకు గానూ ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా మేయర్‌ పి జనార్దనరావు, కమిషనర్‌ బి శ్రీధర్‌లు అవార్డుతోపాటు నాలుగు లక్షల నగదు, మెమొంటోలు అందుకున్నారు. ఇదే కేటగిరీలో సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వితీయ, చండీఘర్‌ కార్పొరేషన్‌ తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. దీంతోపాటు జీవీఎంసీ బడ్జిట్‌లో 40 శాతం నిధులు బీఎస్‌యూపీ పథకానికి కేటాయించి నందుకూ జీవీఎంసీ ప్రథమస్థానంలో నిలిచింది.

ఇందుకు గానూ మరో అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డి చేతులమీదుగా మేయర్‌, కమిషనర్‌ లు అందుకున్నారు. దాంతోపాటు రెండు లక్షల నగదు బహుమతి లభించింది. ఈ కేటగిరీలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వితీయస్థానం దక్కించు కుంది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, అధికారులు హాజర య్యారు.

జేఎన్‌ ఎన్‌ యూఆర్‌ ఎం పథకం కింద పట్టణ పేదలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణలే జీవీఎంసీకి ఈ అవార్డులు తెచ్చి పెట్టాయి. శ్రీనగర్‌ , యాతపాలెం, రాజీవ్‌కాలనీ, వాంబేనగర్‌ వంటి పలుమురికివాడలను పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసి వాటికి మహర్దశ కల్పించింది. కోట్లాది రూపాయలు కుమ్మరించి మహానగరంలో మురికివాడల రూపురేఖలు మార్చింది. ఇక జీవీఎంసీ తన బడ్జెట్‌లోను పట్టణ పేదల కోసం 40 శాతం నిధులు కేటాయించి జాతీయ స్థాయిలో అవార్డును స్వంతం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+