తెలంగాణేతర ఎంపీలతో మొయిలీ భేటీ

మొయిలీతో భేటీ అనంతరం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణపై రేపటి లోగా సోనియా గాంధీ నిర్ణయం వెలువరిస్తారని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కన్నా తెంలగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేత దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవడంపైనే కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతోంది. కెసిఆర్ తో దీక్షను విరమింపజేయడం ఎలాగనే విషయం వారికి తట్టడం లేదు. దీంతోనే కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులు సతమతమవుతున్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణేతర ఎంపీలు దిగి రావడం లేదు. దీంతో అధిష్టానం సతమతమవుతోంది.












Click it and Unblock the Notifications